![]() |
![]() |
.webp)
ప్రియాంక జైన్ - శివ్ కుమార్ ఇద్దరూ బుల్లితెర మీద మంచి జోడి అని అందరికీ తెలుసు. ఆడియన్స్ కి కూడా వీళ్లంటే చాలా ఇష్టం కూడా. బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రియాంక గేమ్ తో ఎంతోమంది ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది. అలాంటి ప్రియాంక వాళ్ళ అమ్మకు సర్వైకల్ కాన్సర్ ఫస్ట్ స్టేజి అని తెలిసేసరికి ఇద్దరూ నీరుగారిపోయారు. ఇక ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు టెస్టులన్నీ చేసాక ఆమెకు లాప్రోస్కోపీ సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించారు. ఇలా సర్జరీ మొత్తం పూర్తై ప్రస్తుతానికి అన్ని రకాల పరీక్షల్లో కూడా ఆమె సేఫ్ అని తెలుసుకున్నాక ప్రియాంక- శివ్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమె కోలుకుని తిరిగి వాళ్ళ ఇంటికి రావడంతో ఆ హ్యాపీనెస్ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ప్రియాంక . అలాగే రాముల వారి గుడికి వెళ్లి అక్కడ మొక్కు కూడా తీర్చుకుంది ప్రియాంక. కాన్సర్ నయం చేసుకుని తిరిగి వచ్చిన వాళ్ళ అమ్మను చూసి ఇదంతా ఆడియన్స్ ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్ వల్లనే జరిగాయని చెప్పింది.
ఇక ఈ రాముల వారి ఆలయంలో 400 ల ఏళ్ళ క్రితం నాడు ఉద్భవించిన హనుమంతుడి ఒరిజినల్ విగ్రహాన్ని శివ్ చూపించాడు. అలాగే ఆలయంలో పూజలన్ని పూర్తి చేసుకున్నాక అన్నదానం నిర్వహించారు. ఇక ఫైనల్ గా ప్రియాంక జైన్, శివ్ కుమార్ కలిసి చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. ఐతే హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ముగ్గురినీ చూసి ఇందులో పేషెంట్ ఎవరూ అని అడిగారట డాక్టర్..అదే ట్విస్ట్.. అంటే ఆమె పేషెంట్ లా కనిపించరు ఆమె చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు శివ్. ఎందుకంటే ప్రియాంక వాళ్ళ అమ్మ చూడడానికి తల్లీకూతుళ్లలా కాకుండా అక్క చెల్లెళ్ళలా కనిపిస్తారు. ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమెను చూడడానికి నటి ప్రగతితో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చింది ప్రియాంక జైన్ తల్లి. ఆమెను చూసి నాగార్జున కూడా ఫిదా ఇపోయారు.
![]() |
![]() |